Ad Code

Godavari Pushkaralu: గోదావరి మహా పుష్కరాలు ఎప్పటి నుంచంటే.. కీలక అప్‌డేట్

 

2027లో రాజమండ్రిలో గోదావరి మహా పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పుష్కరాల కంటే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. కృష్ణ, తుంగభద్ర, కావేరి పుష్కరాలతో పాటు మరెన్నో పుష్కరాలు ఉన్నా, గోదావరి పుష్కరాలు భక్తుల హృదయాల్లో విశేష స్థానం సంపాదించుకున్నాయి.

2015 పుష్కరాల జ్ఞాపకాలు
2015లో రాజమండ్రి గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. మొదటి రోజే లక్షలాదిమంది భక్తులు అన్ని ఘాట్ల వద్ద స్నానాలు చేయడంతో అపసవ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలో ఈసారి అలాంటి అవాంఛనీయ పరిస్థితులు మళ్లీ జరుగకుండా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయడం అధికార యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.